Telangana

అసెంబ్లీ సమావేశాలపై బీఏసీలో కీలక నిర్ణయాలు..!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజా పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశాలల అజెండా ఖరారు చేసేందుకు సమావేశమైన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ఈ రోజు మినహాయిస్తే మరో నాలుగు రోజులు పని దినాలుగా ఖరారు చేసారు. ఈ నెల 10న ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ తొలి సారి సభలో ప్రవేశ పెడుతున్నారు.

Read Also : నిర్మల్ జిల్లాలో దారుణం..ప్రియురాలిని హత్య చేసిన యువకుడు

11న సెల‌వు ప్ర‌క‌టించారు.రేపు (శుక్రవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చ జరగనుంది. చర్చ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ సమాధానమిస్తారు. ఈ నెల 12న సభలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనుంది. 12న సభలో బడ్జెట్ పైన చర్చ చేపట్టనున్నారు. 12, 13 తేదీల్లో బడ్జెట్ పైన చర్చ ..ప్రభుత్వం నుంచి సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్‌కు బ‌దులుగా హ‌రీశ్‌రావు బీఏసీ స‌మావేశానికి వెళ్లారు. త‌న బ‌దులుగా హ‌రీశ్‌రావు బీఏసీకి వ‌స్తార‌ని కేసీఆర్ ముందే స‌మాచారం ఇచ్చారు.

Also Read : కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కాంట్రవర్సీ వద్దన్న రాజగోపాల్ రెడ్డి

బీఏసీకి హ‌రీశ్‌రావు రావ‌డంపై శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బీఏసీ ప్రారంభ‌మైన కాసేప‌టికే హ‌రీశ్‌రావు బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీని పైన స్పందించిన హరీష్ ప్రభుత్వం సభలో గవర్నర్ ప్రసంగం పైన అభ్యంతరాలు వ్యక్తం చేసారు. మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుందని..ఇప్పటి వరకు ప్రభుత్వం అన్ని గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వటం లేదన్నారు. మహిళలకు రూ 2500 అమలు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. సభలో సాగునీటి ప్రాజెక్టుల అంశం పై చర్చకు తాము సిద్దమని హరీష్ స్పష్టం చేసారు.

ఇవి కూడా చదవండి : 

  1. వైద్యులు లేని మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రి….
  2. త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమలు.. గవర్నర్ ప్రసంగంలో తమిళిసై వెల్లడి
  3. హైదరాబాద్ లో ఎన్ఐఏ దాడులు.. ఆ పత్రిక ఎడిటర్ ఇంట్లో సోదాలు!!
  4. మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ రేసులో హేమాహేమీలు.. అధిష్ఠానం చూపు అతనివైపేనా..?
  5. గృహజ్యోతి ఫ్రీ కరెంట్ అర్హుల ఎంపికపై కసరత్తు.. రేషన్ కార్డు ఉంటనే పథకం ?

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.