HyderabadTelangana

అద్దెబస్సుల సమస్యలపై చర్చలు సఫలం.. కీలక విషయాలు వెల్లడించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేస్తోంది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అయితే ఈ పథకం అందుబాటులోకి తీసుకొచ్చినప్పటి నుంచి ప్రయాణికులు కాస్త ఇబ్బందికి గురయ్యారు. సరైన సమయానికి బస్సులు దొరక్క, దొరికిన బస్సుల్లో సీట్లు అందుబాటులో లేక తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అద్దె బస్సులను కోరుతూ పత్రిక ప్రకటన ఇచ్చారు. అవి నిత్యం రోడ్లపై తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వారికి వచ్చిన పలు సమస్యలపై సజ్జనార్ తో సమావేశమయ్యారు అద్దె బస్సు ఓనర్లు. తాజాగా ఏర్పాటైన ఈ సమావేశంలో చర్చలు సఫలం అయినట్లు మీడియాకు వెల్లడించారు ఆర్టీసీ ఎండీ సజ్జనర్. బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశం ముగిసిన అనంతరం కొన్ని అంశాలను వివరించారు.

Also Read : బీఆర్ఎస్ భవన్‍కు రెవెన్యూ శాఖ నోటీసులు.. ఎందుకంటే!!!

అద్దె బస్సు యాజమాన్యాలు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారం రోజుల్లో వారి సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అద్దె బస్సుల యాజమానుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వేస్తామని చెప్పారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. బస్సుల్లో ప్రయాణించే ఏ ఒక్కరికీ అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. సజ్జనార్ తో సమావేశం అనంతరం ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు మీడియాతో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఐదు సమస్యలను విన్నవించినట్లు తెలిపారు. ఎండీ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 10 వ తేదీ లోపల ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నామని అద్దె బస్సుల యాజమానులు పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఎలాంటి అసౌకర్యలు కలుగవని వివరించారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఘనంగా అయోధ్య శ్రీరాముల అక్షింతల వితరణ
  2. ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేస్తా.. కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల
  3. పోస్టాఫీస్‌లో కోటిన్నరకుపైగా ప్రజాధనం స్వాహా.. కోర్టులో లొంగిపోయిన సబ్‌ పోస్టుమాస్టర్‌???
  4. నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్.. నేరుగా కేసీఆర్‌ ఇంటికి..

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.