ఆంధ్ర ప్రదేశ్

అవన్నీ నమ్మకండి.. ఏ చార్జీలు పెంచలేదు.. విద్యుత్ చార్జీలపై స్పందించిన గొట్టిపాటి!..

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పించారని చాలానే సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉండడంతో సామాన్య ప్రజలు కరెంట్ బిల్లులు కట్టలేక లబోదిబోమంటున్నారు. సామాన్య రైతుల ఇళ్లకు వస్తున్న కరెంట్ బిల్లులు తడిచి మోపవుతున్నాయి… ఇంతలోనే మళ్లీ మరోసారి ధరలు పెంచితే డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ చార్జీలపై స్పందించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎటువంటి కరెంటు చార్జీలు పెంచలేదని కీలక ప్రకటన చేశారు.

కావాలనే కొంతమంది “యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ” పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చాలామంది సోషల్ మీడియాలో కావాలనే కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ.. ఆనందం పొందుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో ఇప్పుడే కాదు… భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలు పెంచబోమని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఉపయోగమైనటువంటి నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు నేను ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటానని వెల్లడించారు. కాగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రెనేబుల్ ఎనర్జీకి ఇప్పుడే పెద్ద పీట వేశామని… కేవలం 4.60 పైసలకే పీక్ అవర్స్ లోను విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దీంతో ప్రజలపై విద్యుత్ చార్జీల కారణంగా ఎటువంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే లేవు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇప్పటికే విద్యుత్ చార్జీలు కట్టలేక ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా చార్జీలు పెరుగుతూనే ఉన్నాయని వీటిపై ప్రభుత్వాలు ఆలోచించి ధరలు తగ్గే విధంగా చూడాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు.

భారీ వర్షాలు…ఏపీ కి వాతావరణ శాఖ హెచ్చరికలు?

సరస్వతీ పుష్కరాల పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన పుట్ట మధు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button