ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

బీజేపీలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ - జాయినింగ్‌ ఎప్పుడంటే..!

బీజేపీలో విజయసాయిరెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్టు సమాచారం. వైసీపీని వీడి వ్యవసాయం వైపు వెళ్లిన ఆయన… మళ్లీ రాజకీయాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేయబోతున్నారు. స్వల్ప విరామం తర్వాత… కమలం పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇంతకీ… విజయసాయిరెడ్డి కాషాయ కండువా ఎప్పుడు కప్పుకోబోతున్నారో తెలుసా…? అతి త్వరలోనే.

వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి… వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా చేసినప్పుడు అంతా షాకయ్యారు. వైసీపీకే కాదు ఆ పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత… ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో ప్రచారాలు జరిగాయి. షర్మిలతో భేటీ కావడంతో…. ఆమెకు సపోర్ట్‌గా ఉంటారని అనుకున్నారు. ఆ తర్వాత అదేమీ లేదని తేలిపోయింది. ఆపై… బీజేపీలోకి వెళ్తారని గట్టిగా వాదనలు వినిపించాయి. అంతేకాదు… గవర్నర్‌ పదవి కూడా ఆయనకు దక్కబోతోందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత… ఏపీ రాజకీయ నేతలంతా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారని, ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం ఆయనకే రిజర్వ్‌ చేసిపెట్టారని కూడా చెప్పుకున్నారు. వారు చెప్పినట్టే బీజేపీలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ ఖరారైనట్టు తెలుస్తోంది. కొన్ని నెలల్లోనే అంటే… దాదాపుగా ఆగస్టులో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.

బీజేపీలో చేరిన తర్వాత… విజయసాయిరెడ్డికి ఏ పదవి ఇస్తారు అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఆయనకు మళ్లీ రాజ్యసభలో చోటు కల్పిస్తారా…? లేదా… ముందు ప్రచారం జరిగినట్టు… గవర్నర్‌ పదవి ఇస్తారా…? అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Back to top button