ఆంధ్ర ప్రదేశ్

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటనపై జగన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాకయ్యానని చెప్పారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు జగన్. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ జగన్ Xలో పోస్ట్ పెట్టారు

సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి… ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు.

Back to top button