తెలంగాణ

మరో మూడు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణకు బిగ్ అలెర్ట్

తెలంగాణను అకాల వర్షాలు హడలెత్తిస్తున్నాయి. పలు జిల్లాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ సోమవారం ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో భద్రాద్రి, ఖమ్మం, ములుగు, జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.

ఆదివారం జనగామ, సూర్యాపేట, యాదాద్రి, భద్రాద్రి, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో వడగళ్లతో భారీ వర్షాలు పడ్డాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలతో జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పది వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో మామిడికాయలు, ధాన్యం గింజలు రాలిపోయాయి. పలుచోట్ల వ్యవసాయ మార్కెట్లకు రైతులు తెచ్చిన ధాన్యం వాననీటికి కొట్టుకుపోయింది.


Also Read : టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు – టెన్షన్‌లో చంద్రబాబు..!


యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌ మండలంలోని చామాపూర్‌లో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. ఖమ్మం- దేవరాపల్లి పాత జాతీయ రహదారిపై ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి-సీతారాంపురం సమీపంలో చెట్లు పడిపోవటంతో రెండువైపులా 4 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. అకాల వర్షాలతో పంట నష్టపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షాలతో ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Back to top button