ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న జగన్‌ - అంతా టీడీపీ పుణ్యమే..!

ఏపీ రాజకీయాల్లో మళ్లీ వైఎస్‌ జగన్‌ పేరు మారుమోగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఏ పార్టీ నేతలైనా సరే జగన్‌ పేరు తలవకుండా మాట్లాడలేకపోతున్నారు. జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నామని అనుకుంటూనే ఆయన మైలేజ్‌ని భారీగా పెంచుతున్నారు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ను కూడా టీడీపీ నేతలే యాక్టివ్‌ చేస్తున్నారు. అదెలా అనుకుంటున్నారా..? అసలు ఏం జరుగుతుందంటే..!

వైఎస్‌ జగన్‌ రాప్తాడు పర్యటనను హైలెట్‌ చేసిందే టీడీపీ నేతలు అనే టాక్‌ వినిపిస్తోంది. అంతేకాదు జగన్‌ రాప్తాడు పర్యటన సూపర్‌ సక్సెస్‌ కావడానికి కూడా టీడీపీ నేతలే కారణమని అంటున్నారు విశ్లేషకులు. జగన్‌ రాప్తాడు వస్తున్నాడని తెలిసి పరిటాల సునీత అంతెత్తున లేచారు. జగన్‌ పర్యటనను అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికారు. జగన్‌ను అడ్డుకోవడం కుదరదని తెలిసినా పార్టీ పెద్దల మెప్పు ఆమె అలా చేసుండొచ్చు. కానీ అది రివర్స్‌ అయ్యింది. వైసీపీ శ్రేణులంతా యాక్టివ్‌ అయ్యారు. తమ అధినేత పర్యటనను ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా జగన్‌ రాప్తాడు పర్యటన జనసంద్రంగా మారింది. కార్యక్రమం విజయవంతం అయ్యింది.


Also Read : మంత్రి పదవిదేముంది…ముందుంది అసలైన ఆట – టీడీపీతో జతకట్టిందే అందుకట..!


పరిటాల సునీత ఒక్కటే కాదు హోంమంత్రి అనితతోపాటు దాదాపు టీడీపీ నేతలంతా వైఎస్‌ జగన్‌ను విమర్శించకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటున్న వైసీపీ కార్యకర్తల్లో కసి పెరుగుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తపన వారిలో పెరుగుతోంది. అంటే… టీడీపీ నేతలు జగన్‌ను ఎంత తిడితే వైసీపీకి అంత మేలన్నమాట. జగన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టామని, 11 సీట్లకు పరిమితం చేశామని ఇక ఆయన కోలుకోవడం కష్టమని అనుకుంటున్న టీడీపీ నేతలు వారి చేతులారా మళ్లీ జగన్‌ను ఫామ్‌లోకి తెస్తున్నారు. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయనకు, ఆ పార్టీకి హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ విషయం తెలుగు దేశం పార్టీ నేతలకు ఎప్పటికి తెలుస్తోందో ఏమో?. ఇంకా జగన్‌నే టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్‌..!

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Back to top button