Telangana

మేడారంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులు…

క్రైమ్ మిర్రర్, మంగపేట, మేడారం : ములుగు జిల్లా ఎస్.ఎస్.తాడ్వాయి మండలం మేడారంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం మహా జాతర గత నెల ఫిబ్రవరి 21 నుండి 24వ తేది వరకు జరిగిన సంగతి తెలిసిందే. మేడారం మహా జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిమంది భక్తులు తరలిరాగా జాతర సమయంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు ఎదురవకుండా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ ( సీతక్క ) ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శ్రీమతి అనిత రమచంద్రన్ పర్యవేక్షలో మేడారం జాతర పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా పారిశుధ్య పనులను చేపట్టారు. అదే విధంగా జాతర అనంతరం జాతర పరిసర ప్రాంతాలలో జిల్లా పంచాయతీ అధికారి ( డీపీఓ ) ( ఎఫ్ఏసీ ) నాగపురి స్వరూప పర్యవేక్షణలో పలువురు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది కార్మికులతో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు.

Read Also : ‘యాదాద్రి దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం!!’.. వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం ఫోటో

గద్దెల ప్రాంగణం, గద్దెల పరిసరాలు, శివరాంసాగర్‌చెరువు, ఆర్టీసీ బస్టాండ్, మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, నార్లాపురం, కొత్తూరు, పడిగాపురం, చింతల్ క్రాస్ తదితర గ్రామాల్లో చెత్తాచెదారం తొలగిస్తున్నారు. భక్తులు వదిలివేసిన వ్యర్థాలు, ప్లాస్టిక్‌కవర్లు, ఆహార పదార్థాలను ట్రాక్టర్లలో ఎత్తి డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. జాతర పరిసర గ్రామాల్లో దుర్వాసన రాకుండా బ్లీచింగ్‌పౌడర్‌ను చల్లుతున్నారు. గద్దెల వద్ద అపరిశుభ్రంగా ఉన్న ప్రాంగణాన్ని నీటితో కడిగిస్తూ ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా పలు రకాల మందులను పిచికారీ చేస్తున్నారు. గద్దెల ప్రాంగణంతో పాటు జాతర పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారి ( డీపీఓ ) ( ఎఫ్ఏసీ ) నాగపురి స్వరూప పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ పారిశుధ్య పనులను చేయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ దంపతులు.. పట్టువస్త్రాలు సమర్పణ
  2. టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు, బిగ్ బాస్ ఫేమ్ సూర్యకిరణ్ కన్నుమూత
  3. ఆపరేషన్ ఆకర్ష్‎తో బీజేపీ ఖుష్.. అభ్యర్థుల ప్రకటనపై నాయకుల జోష్..
  4. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం.. నేడు భద్రాచలంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్
  5. కాంగ్రెస్ వైపు మరో బీఆర్ఎస్ నేత చూపు.. శరవేగంగా మారుతున్న రాజకీయాలు!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.