National

బిజాపూర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మావోయిస్ట్‌లకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున బిజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా నక్సలైట్ సహా ఆరుగురు హతమైనట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చికురుభట్టి, పుసబాక గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. యాంటీ-నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడిన మావోయిస్ట్‌లు కాల్పులు జరిపినట్టు బస్తర్ రేంజ్ ఐటీ పి. సుందరరాజన్ తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్ (డీఆర్జీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా ఎలైట్ యూనిట్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టిందని చెప్పారు.

Read Also : మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ!!

మావోయిస్ట్‌ల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని, ఎన్‌కౌంటర్ ప్రాంతంలో ఆరు మృతదేహాలను బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరిలో ఓ మహిళా నక్సలైట్‌ కూడా ఉన్నట్టు ఐజీ వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోందని అన్నారు. కాగా, బిజాపూర్ జిల్లాలోని లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఏప్రిల్ 19 ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన బీజాపూర్‌.. మావోయిస్ట్‌లకు కంచుకోట. అక్కడ కీకారణ్యాలు మావోలకు వరంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భద్రతా బలగాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నక్సల్స్ ఏరివేత కోసం అడవుల్లో జల్లెడ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ లొల్లి… సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్న కొందరు నేతలు!!
  2. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో చేరే మెదటి వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి… కేటీఆర్ హాట్ కామెంట్స్
  3. అన్నదాతలకు అండగా రంగంలోకి గులాబీ బాస్.. రోడ్ మ్యాప్ రెడీ!!!!
  4. దేశానికి ఏం చేశారని మూడోసారి మోదీకి ఓటు వేయాలి… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  5. పైన పటారం.. లోన లొటారం.. నిర్లక్ష్యానికి పరాకాష్టలో మిషన్ భగీరథ పనులు!!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.