క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: తమకు కేటాయించిన అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలంటూ 200 మందికి పైగా మాజీ ఎంపీలకు కేంద్ర గృహ నిర్మాణ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం నోటీసులు జారీ చేసింది. లోకసభ రద్దయిన నెలరోజుల లోపునే మాజీ ఎంపీలు వారికి కేటాయించిన అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత శాఖ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఖాళీ చేయకుంటే బలవంతంగా నైనా ఖాళీ చేయిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ సైతం ఇటీవలే తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసింది. 200 మందికి పైగా మాజీ ఎంపీలు తమ బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంది.
81 Less than a minute