క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్ర ప్రదేశ్ టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్‌లో స్వల్ప మార్పు జరగనున్నట్లు
తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 17 నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలతో రివైజ్‌డే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది విద్యాశాఖ.
అయితే పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఎగ్జామ్స్ పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ మార్చి 31వ రంజాన్ సెలవు దినంగా ఏపీ ప్రభుత్వ క్యాలండర్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నెలవంక కనుక మార్చి 31న కనిపిస్తే అదే రోజు రంజాన్ జరుపుకుంటారు. ఆ రోజున పండగ కన్ఫామ్ అయితే చివరి ఎగ్జామ్ సోషల్ పేపర్ మార్చి 31 బదులుగా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ఏపీ ఎగ్జామ్స్ విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. చివరి ఎగ్జామ్ ఒక్కటీ ఒక్కరోజు వెనక్కి జరిగే అవకాశం ఉందని, కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలని విద్యార్థులకు శ్రీనివాస్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
1.ఊపిరితిత్తుల సమస్యలతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి?
2.నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!… రాష్ట్రంలో కొత్తగా 20వేల ఉద్యోగాలు?
3.తొక్కిసలాట దెబ్బతో కొత్త రూల్స్ ప్రకటించిన UP ప్రభుత్వం!..!..