ఊపిరితిత్తుల సమస్యలతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రముఖ చలనచిత్ర నిర్మాత వేదరాజు టింబర్ (55) ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఇతన్ని హైదరాబాదులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

నేటి నుండే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!..

కాగా కొన్ని కన్స్ట్రక్షన్స్ రంగాలలో రాణిస్తున్న ఈ ప్రముఖ నిర్మాత వేదరాజు సినిమాలపై మక్కువతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడమే కాకుండా యంగ్ హీరో అల్లరి నరేష్ తో మడత కాజా మరియు సంఘర్షణ లాంటి మంచి చిత్రాలను నిర్మించి తనకంటూ ప్రత్యేక మైనా పేరు అలాగే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం మరో సినిమాకు సన్న హాలు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన జరగడం సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదమే నెలకొంది. విషయం తెలుసుకున్న ప్రముఖ నిర్మాతలు అలాగే నటులు నిర్మాత వేదరాజుకు సంతాపం తెలియజేస్తున్నారు.

నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!… రాష్ట్రంలో కొత్తగా 20వేల ఉద్యోగాలు?

రంజీల్లో పాదాలు మోపిన కోహ్లీ!… కేరింతలతో అభిమానులు స్వాగతం?

Exit mobile version