తెలంగాణహైదరాబాద్

హైదరాబాద్‌ శివారులో పోలీసుల కాల్పులు.. నలుగురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేట సమీపంలో కాల్పులు కలకలంరేపాయి. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. వారిని పట్టుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ గ్యాంగ్‌లోని వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్ఠి గ్యాంగ్ కొంతకాలంగా జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలను టార్గెట్ చేస్తోంది. వరుస దొంగతనాలతో నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచారు.. ఎస్పీ స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున హైవేపై ఈ దొంగల ముఠా పెట్రోలింగ్‌ పోలీసుల కంటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని వెంబడించారు. ఇలా ఆ గ్యాంగ్‌ను వెంటాడుతూ వస్తూ.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చాక స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేశారు.

Also Read : బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు!!

పార్థి గ్యాంగ్‌లో దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు కలిసి వారిని వెంబడించారు. ఆ దొంగల ముఠాను వెంటాడుతూ పెద్దఅంబర్‌పేట సమీపంలో.. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరకు రాగానే.. దొంగలు కత్తులతో పోలీసులపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్‌లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఈ దొంగల ముఠాలోని వారిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.. ఇంకా ఈ గ్యాంగ్‌‌లో ఉన్నవారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్‌ చిలకలగూడలో మొబైల్ ఫోన్ స్నాచర్లపై, సైదాబాద్‌లో చైన్‌ స్నాచర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రధాన మంత్రి మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. మోదీ, అమిత్ షాలకి పలు వినతి పత్రాల అందచేత!!
  2. ఫ్రీ బస్సు పథకం వల్ల టీజీఎస్ఆర్టీసీకి 2500 కోట్ల నష్టం.. ఒక్క పైసా కూడా ఇవ్వని సర్కార్!!
  3. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం.. గడువు ముగిసిందని తిప్పి పంపిన బ్యాంకు అధికారులు!!!
  4. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పదా??.. పార్టీ మారేందుకు సిద్దమైన మరో ఎమ్మెల్యే!!
  5. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇటుక పెళ్ల కదిలించినా హైదరాబాద్‌లోని గాంధీభవన్ కూల్చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!

Back to top button