*అప్పు తిరిగి అడిగినందుకు పథకం ప్రకారం ఇద్దరి హత్య*
*ముగ్గురు నిందితులకి జీవిత ఖైదు, జరినామా*
నల్గొండ, క్రైమ్ మిర్రర్:
అప్పుగా తీసుకున్న డబ్బులు అడిగినందుక పథకం ప్రకారం హత్య చేసిన కేసులో నిందితులకు గౌరవనీయ 2nd ADJ cum SC/ST కోర్టు జడ్జి, నల్గొండ శ్రీమతి రోజా రమణి గారు U/Sec.302 r/w 34 IPC & Sec 3 (2) (v) of SC/ST (POA) Act IPC ప్రకారం జీవిత ఖైదు మరియు రూ. 1000/- జరిమానా చెల్లించడంలో విఫలమైతే (04) నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధించడం జరిగిందని జిల్లా అడిషనల్ ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
వివరాలలోకి వెళితే కనగల్ మండలం కుమ్మరిగూడెం ( చిన్నమదారం) కి చెందిన మల్లికంటి వెంకటేశ్వర్లు, తండ్రి రాములు అనే వ్యక్తి నల్లగొండ పట్టణానికి చెందిన బొంద రవి కుమార్, యస్.కె గౌస్ పేరు మీదుగా కొంత డబ్బులు అప్పుగా తీసుకోవడం జరిగింది. వెంకటేశ్వర్లు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వవలసిందిగా అడగగా వివిద కారణాలు చెప్పుతూ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందిపెడుతున్నాడు. ఈ క్రమంలో రవి కుమార్, అతని మిత్రుడు గౌస్ లు నిలదీసి అడగగా వీరిని ఎలాగైనా అంతమొందించాలని మల్లికంటి వెంకటేశ్వర్లు అతని తమ్ముడు అయిన మళ్ళికంటి యాదగిరి అతని భార్య శోభ కలిసి వీరిని పథకం ప్రకారం హత్య చేయాలని తేది 07-08-2014 రోజున కనగల్ మండలం తన స్వగ్రామం అయిన కుమ్మారిగూడెం కి మల్లికంటి యాదగిరి ఫోన్ ద్వారా తమ డబ్బులు ఇస్తామని నమ్మబలికి రప్పించుకొని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపాగ మృతుని అల్లుడు విద్యాసాగర్ ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితుల పైన కనగల్ పోలీస్ స్టేషన్లో U/Sec.302 r/w 34 IPC & Sec 3 (2) (v) of SC/ST (POA) Act IPC ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం సరిఅయిన ఆధారాలు కోర్టుకి సమర్పించగా, నేడు విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదీ మరియు జరినామ విధించి మహిళను చంచలగూడ జైలు మరియు మిగతా ఇద్దరు నేరస్తులను చర్లపల్లి జైలు కు తరలించడం జరిగిందని తెలిపారు.
ఈ కేసులో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ప్రస్తుత అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ప్రస్తుత నల్గొండ డీఎస్పీ శివ రాం రెడ్డి, అప్పటి డీఎస్పీ రాం మోహన్ రావు, సిఐ సుబ్బిరామి రెడ్డి, యస్.ఐ పరమేష్, ప్రస్తుత చండూర్ సిఐ వెంకటయ్య, కనగల్ యస్. ఐ విష్ణుమూర్తి
ఏపిపి అఖిల,CDO PCs శేఖర్,నగేష్, లైసెనింగ్ ఆఫీసర్స్ హెడ్ కానిస్టేబుల్ పి.నరేందర్, పిసి ఎన్.మల్లికార్జున్ గార్లను జిల్లా ఎస్పీ గారు అబినందిచి రివార్డ్ అందచేస్తామన్నారు.