క్రీడలు

షేక్ హ్యాండ్ ఇవ్వాలనే చట్టం ఏం లేదు : బీసీసీఐ అధికారి

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఆసియా కప్లో భాగంగా ఒక వివాదం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. యూఏఈ వేదికగా పాకిస్తాన్ మరియు టీమిండియా మద్య టి20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ను భారత్ చిత్తుచిత్తు చేసిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మ్యాచ్లో భారత్ గెలిచిన అనంతరం భారత బ్యాట్స్మెన్లు ప్రత్యర్థులకు షేక్ హాండ్స్ ఇవ్వకుండానే నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయి పాకిస్తాన్ దేశాన్ని అవమానించారు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు కాసేపు గ్రౌండ్ లోనే ఉండి విచిత్రంగా చూశారు. సాధారణంగా మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ అనేవి తీసుకుంటారు. ఇది ఆటలో భాగంగా ఒక స్ఫూర్తిని నింపుతుంది. కానీ మన భారత బ్యాట్స్మెన్లు అలా చేయడం పట్ల పాకిస్తాన్ ఆటగాళ్లతో పాటు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా ఆగ్రహించారు. కానీ టీమిండియా అభిమానులు మాత్రం మంచి పని చేశారని ఇండియన్ క్రికెటర్స్ ని పొగుడుతున్నారు.

Read also : యూరియా టోకెన్ల కోసం రైతులు ధర్నా!

అయితే తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు లేనప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కచ్చితంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే చట్టం లేదు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం అనేది ఒక గుడ్ విల్ జస్చర్ మాత్రమే అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యర్థులతో షేక్ హ్యాండ్ కు సంబంధించి ప్రత్యేక రూల్ బుక్ అనేవి లేవు అని… అలాంటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది వాళ్ళ ఇష్టంగా జరుగుతుంది అని చెప్పుకొచ్చారు. దీంతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా బీసీసీఐ కి సలాం కొడుతున్నారు. పహల్గాం ఉగ్ర దాడి తరువాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. దీంతోనే అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఇండియన్ క్రికెటర్స్ మ్యాచ్ అనంతరం అలా చేయాల్సి వచ్చింది.

Read also : నో షేక్ హాండ్స్.. నో హగ్స్.. టీమిండియాను మెచ్చుకుంటున్న అభిమానులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button