నూతనకల్ ( క్రైమ్ మిర్రర్) :యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఒక యూరియా బస్తా కోసం రాత్రంతా పిఏసీఎస్ వద్ద పడిగాపులు కాసిన యూరియా బస్తా దొరకకపోవడంతో అన్నదాతలు ఆగ్రహించారు. బుధవారం టోకెన్ల కోసం నిల్చున్న రైతులకు నిరాశ ఎదురవడంతో మరోసారి సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై కూర్చొని ధర్నాకు దిగారు. టోకెన్లు ఇచ్చి యూరియాను అందజేయకపోతే చావే చరణ్యమంటూ నినాదాలు చేశారు.
రైతులు ధర్నాకు చేస్తున్న సమయంలో వర్షం రావడంతో తడుస్తూ ధర్నాలు కొనసాగించారు. రైతుల ధర్నాతో వాహనాలు భారిగా రెండు వైపులా నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు.