
క్రైమ్ మిర్రర్,సినిమా:- టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతం అవుతోంది. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాల తర్వాత విజయ్‌కు సరైన హిట్ పడలేదు. ప్రేక్షకులను అలరించడానికి ఆయన ఎన్ని రకాల ప్రయోగాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’, అలాగే ‘కింగ్ డమ్’ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న విజయ్, ఇప్పుడు తన ఆశలన్నీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతున్న ‘రణబాలి’ సినిమాపైనే పెట్టుకున్నారు.
ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. పెళ్లి తర్వాత భార్య రష్మికతో కలిసి ఆయన తీసిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో తీవ్ర ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, ఈ ‘రణబాలి’ మూవీ కచ్చితంగా రౌడీ హీరోకు అదృష్టం తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మళ్లీ విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో వేచి చూడాలి.
దసరా పండుగ సెలవులు ఖరారు: విద్యాసంస్థలకు కఠిన నిబంధనలు జారీ చేసిన తెలంగాణ సర్కార్!