
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం రోజు అసెంబ్లీలో మాట్లాడారు. గ్రామాల్లో సరిపోను బస్సులను ఏర్పటు చేయాలన్నారు.ఉమ్మడి జిల్లాలోని యాదగిరిగుట్ట పెద్ద డిపో కావున ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించాలని కోరారు. గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు వచ్చిన సమయంలో బస్సులు నడవటం లేదు, పాఠశాలకు సెలవులు ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరారు.మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఏర్పాటు చేయడం వల్ల,ఆర్టీసీకి మంచి డిమాండ్ ఉందన్నారు. మహిళలు అన్ని సమయంలో ఆర్టీసీబస్సు సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు.కావున యాదగిరిగుట్ట డిపోకు ఎలక్ట్రికల్ బస్సులను అందజేయాలని కోరారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మీ పథకం వర్తిచటం లేదు,దీని ద్వార నెలకు వచ్చే ఆలయ ఆదాయంలో డిపోకు ఎక్కువ కట్టవలసి వస్తుందని, కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం వర్తించే లాగా చూడాలన్నారు.ప్రతి గ్రామానికి నూతనంగా ఎలక్ట్రికల్ బస్సులను పునరుద్ధరించాలని కోరారు.గత పది ఏళ్లలో ఆర్టీసీ ధర్నాలు చేసి ఎంతో మంది చనిపోయారు.మన ప్రజాపాలన ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి పరిరక్షించి ఆదుకున్నామన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు 104 ఉద్యోగుల వినతి
చైనీస్ మాంజా ప్రజల ప్రాణాలకే కాదు పర్యావరణానికి కూడా ముప్పే : సజ్జనార్





