
Kapra Division : కాప్రా డివిజన్ పరిధిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి అందులో మస్కిటో లార్వా వృద్ధి చెందకుండా డ్రోన్ సహయంతో శుక్రవారం పిచికారి చేయడంతో పాటు మురుగునీరు నిల్వలో ఆయిల్ బాల్స్ ను వినియోగించారు.సాకేత్ కాలనీలోని పార్క్ రెసిడెన్సి, గోకుల్ రెసిడెన్సి అపార్ట్ మెంట్ పక్కన గల మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతంలో (సుమారు ఎకరం ప్రాంతంలో) కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణి (Swarna Raju Shiva Mani ) చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దోమ లార్వా నిర్మూలనలో భాగంగా జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ హేమంత్ పాటిల్ (Hemanth Patil IAS) ఆదేశాల మేరకు ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ జగన్,( DC Jagan Kaptra Circle) కాప్రా సర్కిల్ అసిస్టెంట్ ఎంటామాలజిస్ట్ డి.రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఆయిల్ బాల్స్ వల్ల ఆయిల్ మొత్తం నీటి పైన ఒక పోరా లాగా ఏర్పడి నీటిలో గల లార్వాకు ఆక్సిజన్ అందకుండా చేస్తుందన్నారు. ఆక్సిజన్ అందకపోవడంతో లార్వా చనిపోతుందన్నారు.దీనివల్ల దోమల బెడద తగ్గి, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడకుండా ఉండ వచ్చున్నారు.
డ్రోన్ సహాయంతో నీటి నిలువ ఉన్న మధ్య ప్రాంతం (మలేరియా సిబ్బంది వెళ్ల లేని ప్రదేశం)లో డ్రోన్ సహయంతో స్ప్రే చేసే అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్,అపార్ట్ మెంట్ వాసులు వినోద్, ప్రసాద్, శ్రీనివాస్, బివి శర్మ, ఇంచార్జీ ఈఎఫ్ఏ అనిల్, ఎంటమాలజి సిబ్బంది పాల్గొని, దోమలపై వాటి వలన వ్యాపించి వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.
ఇవి కూడా చదవండి …
-
టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట బోర్డు – తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
-
త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ – కొత్త మంత్రులు వీరే
-
తమిళనాడు గవర్నర్‌గా విజయసాయిరెడ్డి – ఇందంతా జగన్ స్కెచ్చేనా?
-
భర్తతో విభేదాలు లేవన్న సింగర్ కల్పన – ఆత్మహత్యాయత్నం చేయలేదంటూ వీడియో రిలీజ్
-
భర్తతో విభేదాలు లేవన్న సింగర్ కల్పన – ఆత్మహత్యాయత్నం చేయలేదంటూ వీడియో రిలీజ్