తెలంగాణ

ఏ మారు మూల గ్రామాలకు వెళ్లిన ఇందిరమ్మ పేరే?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
ఇందిరమ్మ అంటేనే ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. రోటీ, కపడా, మకాన్‌ అని టీపీసీసీ అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలో.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఆమె ఇచ్చిన ఇల్లు, ఇంటి జాగా ఇప్పటికీ కనిపిస్తాయని చెప్పారు. మనం పుట్టకముందే ఆమె ప్రతి ఊర్లోనూ పేదలకు ఇల్లు, ఇంటి జాగా ఇచ్చారని, ఆమె చరిత్ర ఏం తెలుసునని బండి సంజయ్‌ మాట్లాడుతున్నారని నిలదీశారు. ‘‘నీ పార్లమెంటు నియోజకవర్గంలో ఏ ఊరికైనా వెళదాం. అక్కడ ఆమె ఇచ్చిన ఇల్లు ఉంటుంది. వచ్చే ధైర్యం నీకుందా?’’ అని బండి సంజయ్‌కి సవాల్‌ విసిరారు. ఇందిరమ్మకు, కాంగ్రెస్‌ పార్టీకి క్షమాపణలు చెప్పి చేసిన తప్పును సరిద్దుకోవాలని హితవు పలికారు. గాంధీభవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80ఏళ్ల వయసున్న ఏ అవ్వా, తాతను అడిగినా ఇందిరాగాంధీ చరిత్ర ఏంటన్నది చెబుతారన్నారు.

ఆమె ఆరేళ్ల పాటు జైలు జీవితం గడిపారని తెలిపారు. రాజీవ్‌గాంధీ.. ఆమె జైల్లో ఉన్నప్పుడే పుట్టారన్నారు. పాకిస్థాన్‌ సైన్యాన్ని తరిమికొట్టి బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్ర ఇచ్చిన చరిత్ర ఇందిరమ్మదని చెప్పారు. ఈ చరిత్ర తెలియని బండి సంజయ్‌.. ఇందిరమ్మను గురించి మాట్లాడి నవ్వుల పాలు కావద్దన్నారు. తాము ఎప్పుడైనా వాజ్‌పేయి, ఆడ్వాణీల గురించి తప్పుగా మాట్లాడామా? అంటూ నిలదీశారు. ‘‘ఇందిరాగాంధీ.. బండి సంజయ్‌కైనా, నాకైనా జేజమ్మ. ఇందిరమ్మ గురించి సంజయ్‌ మాట్లాడటం.. జేజమ్మకు దగ్గు నేర్పినట్లుగా ఉంది’’ అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ హీరో.. రేవంత్ ను జనం తిడుతున్నరు..కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు</ఏ

దడ పుట్టిస్తున్న సైబర్ దాడులు!..ప్రతి రోజు వేల సంఖ్యల్లో కేసులు?

Back to top button