జాతీయంరాజకీయం
Trending

డీలిమిటేషన్‌పై కేంద్రంతో స్టాలిన్‌ పోరాటం – ఏపీ, తెలంగాణ కలిసివస్తాయా…?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-డీలిమిటేషన్‌.. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన. ఈ అంశం దక్షిణాది వర్సెస్‌ కేంద్రం అన్నట్టుగా మారింది. జనగణన చేసి.. దాని ఆధారంగా డీలిమిటేషన్‌ చేయాలని కేంద్రం భావిస్తోంది. అదే జరిగితే దక్షిణాదికి నష్టం జరుగుతోందన్న వాదన ఉంది. అందుకే డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్‌. కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా కలిసి రావాలని కోరుతున్నారు స్టాలిన్‌. పోరాటంలో కలిసి రావాలని 7 రాష్ట్రాల్లోని 29 పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశారు. అందులో.. ఏపీ నుంచి బీజేపీ, జనసేన, టీడీపీ, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలకు, తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు లేఖలు రాశారు స్టాలిన్‌. మరి ఆ పార్టీలు కలిసి వస్తాయా…? కేంద్రంపై పోరుకు సై అంటాయా..?

చిరంజీవి, పవన్‌ నుంచి అప్పులు తీసుకున్న నాగబాబు – ఆయన ఆస్తులు ఎంతంటే..?

డీలిమిటేషన్‌ అంశంపై ఈనెల 22న చెన్నైలో జేఏసీ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో పార్టీలు తమ తరపున సీనియర్‌ నేతలను పంపాలని కోరారు స్టాలిన్. పెరిగిన జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అన్నారు. అందుకే.. అందరం కలిసి ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. అయితే.. స్టాలిన్‌ పిలుపుకు ఎన్ని పార్టీలు స్పందిస్తాయి..? ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీల రియాక్షన్‌ ఎలా ఉంటుంది…? స్టాలిన్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధపడతాయా…? బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతాయా..?

ఏపీ విషయానికి వస్తే… టీడీపీ, జనసేన NDA కూటమిలో ఉన్నాయి. కనుక ఈ రెండు పార్టీలు స్టాలిన్‌తో కలిసి బీజేపీపై పోరాటానికి ఎట్టిపరిస్థితుల్లో ముందడుగు వేయవు. ఏపీ బీజేపీ ఎలానూ రాదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా ఒక రకంగా బీజేపీకి అనుకూలమే. కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పే అవకాశం ఉండదు. సో.. ఏపీ నుంచి అధికార పార్టీనే కాదు… ప్రతిపక్ష వైసీపీ కూడా డీలిమిటేషన్‌పై కేంద్రంతో పోరాడేందుకు సిద్ధంగా ఉండవు.

వైఎస్‌ వివేకా హత్య కేసు సాక్షుల మరణాల్లో మిస్టరీ – పరిటాల కేసులోనూ ఇంతే..!

తెలంగాణ విషయానికి వస్తే… అధికార కాంగ్రెస్‌ పార్టీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తోంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నష్టపోతామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును తప్పుబట్టారు. కనుక.. స్టాలిన్‌తో సమావేశానికి కాంగ్రెస్‌ కలిసివస్తుందనే చెప్పాలి. బీఆర్‌ఎస్‌ స్టాండ్‌ అంచనా వేయడం కష్టమే. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి హరీష్‌రావు మాత్రమే మాట్లాడారు. కేసీఆర్‌ గానీ, కేటీఆర్‌ గానీ ఆ ప్రస్తావన ఇప్పటివరకు తేలేదు. పైగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం అంటే… ఆ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించుకునే అవకాశం ఉంది. పైగా రేవంత్‌రెడ్డి వెళ్తుంటే.. ఆయనతో కలిసి బీఆర్‌ఎస్‌ వెళ్లే ప్రసక్తే ఉండదు. సో… డీలిమిటేషన్‌పై పోరాటానికి ఏపీనే కాదు.. తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ మినహా పెద్దగా స్పందన వచ్చే అవకాశాలు ఉండవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button