తెలంగాణ

మంత్రి తుమ్మలను సన్మానించిన ఆంధ్రా పామాయిల్ రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఐదు జోన్ల పామాయిల్ రైతులు కలిసి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ లో ఐదు జోన్ లలో పామాయిల్ సాగు అవుతుండగా ఈ ఐదు జోన్ ల పరిధిలోని పామాయిల్ ఫ్యాక్టరీ లు ఓఈఆర్‌ (ఫ్రూట్ నుండి వచ్చే ఆయిల్ శాతం) తక్కువ చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని,ప్రభుత్వం కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి పరిస్థితి వివరించడంతో మంత్రి స్పందించి తెలంగాణ ఆయిల్ ఫెడ్ నుండి అనుమతులు ఇప్పించి ఐదు జోన్ల పామాయిల్ గెలలు అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయించారు.


Also Read : బీజేపీలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ – జాయినింగ్‌ ఎప్పుడంటే..!


తెలంగాణ ఫ్రూట్ 19.42 శాతం ఉండగా ఆంధ్రా ఫ్రూట్ ఓఈఆర్‌ కూడా దాదాపు సమానంగా ఉందని ఆయిల్ ఫెడ్ దృవీకరించింది.ఈ ఓఈఆర్‌ లెక్కల ఆధారంగా ధరలకోసం పోరాడతామని ఆంధ్రా రైతులు అంటున్నారు.పక్క రాష్ట్రం అయినప్పటికీ తమపై జరుగుతున్న దోపిడీ ని అర్థం చేసుకుని సహకరించినందుకు మంత్రి తుమ్మలను రైతులు సన్మానించారు.

భారత ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహించడానికి “నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్” (NMEO-OP) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో దేశంలో పామాయిల్ సాగు అవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మిజోరం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని కేంద్రాన్ని కలుస్తానని,దిగుమతి సుంకం విషయంలో రైతులకు లబ్ది చేకూరే విధంగా చర్యలు తీసుకునే ఏర్పాటు చేస్తానని మంత్రి తుమ్మల రైతులకు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button