
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- వల్లభనేని వంశీకి వైసీపీలో కీలక పదవి దక్కబోతోందా..? నాలుగు నెలలు జైలు జీవితం అనుభవించిన వంశీపై వైఎస్ జగన్‌కు సింపతీ పెరిగిందా..? త్వరలోనే ఆయనకు వైసీపీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. జగన్‌ను కలిసిన వంశీకి కొండంత భరోసా ఇచ్చారట అధినేత. దీంతో.. వంశీ దంపతులు సంతోషంలో మునిగిపోయారట. ఇంతకీ ఏంటా కీలక పదవి…? జగన్‌తో ఏం చర్చించారు…?
వల్లభనేని వంశీ జైలుకు వెళ్లాక.. ఆయనపై ఎన్నో కథనాలు వచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై కోపంగా ఉన్నారని.. పార్టీ నుంచి సహకారం దక్కడంలేదంటూ రగిలిపోతున్నారని.. రకరకాల వార్తలు వచ్చాయి. వంశీని కాదని.. ఆయన భార్య పంకజశ్రీకి గన్నవరం వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని. అది వంశీకి ఏ మాత్రం ఇష్టం లేదని కూడా ప్రచారం జరిగింది. అయితే… ఆ వార్తలను పటాపంచలు చేస్తూ… జైలు నుంచి బయటకు వచ్చిన 24 గంటల్లోనే వైఎస్ జగన్‌ను కలిశారు వల్లభనేని వంశీ దంపతులు. జగన్‌కు వారితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడినట్టు సమాచారం. నాలుగు నెలలు జైల్లో ఉంటూ ఎదుర్కొన్న కష్టాలను జగన్‌కు వివరించారట వంశీ. తమకు అండగా ఉన్నందుకు జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారట. దీంతో… జగన్‌లో వంశీపై సింపతీ పెరిగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కక్ష సాధింపుల రాజకీయాలకు భయపడకూడదని పార్టీ అధినేత ధైర్యం చెప్పారట. వంశీ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారట.
2019లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ వెంటనే వైసీపీలో జంప్ అయ్యారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. దీంతో… 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారన్న ప్రచారం అందుకే. కక్ష సాధింపులో భాగంగానే ఆయనపై 11 కేసులు పెట్టారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. మొత్తంఒ 11 కేసుల్లో బెయిల్ లభించడంతో.. నాలుగు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు వంశీ. బుధవారం సాయంత్రం జైలు నుంచి అడుగు బయటపెట్టారు.. గురువారం ఉదయం వైఎస్ జగన్‌ను కలిశారు.
వల్లభనేని వంశీకి, ఆయన ఫ్యామిలీకి అండగా ఉండాటని భరోసా ఇచ్చారట వైఎస్ జగన్. అంఏతకాదు… త్వరలోనే పార్టీలో కీలక పదవిని వంశీకి ఇవ్వాలని భావిస్తున్నారట వైసీపీ అధినేత. ఆ పదవి ఏంటంటే…? గన్నవరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. గతంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు… విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను వంశీకి అప్పగించబోతున్నారట జగన్. అక్కడ ఉన్న సామినేని ఉదయభాను జనసేనలో చేరిపోయారు. దీంతో.. ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ బాధ్యతలను వంశీ ఇవ్వాలన్న ఆలోచన ఉందని సమాచారం.
కాపు కాసి కమ్మ కత్తితో అత్తను నరికి చంపిన అల్లుడు
ఇంగ్లాండ్ గడ్డపై… తొలి డబుల్ సెంచరీ చేసిన ఇండియన్ యువ కెప్టెన్