అంతర్జాతీయం

ట్రంప్‌కు షాక్.. అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్!

అమెరికాలోని భారతీయులకు గుడ్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ రాకతో టెన్షన్ పడుతున్న ఎన్నారైలకు అక్కడి స్థానిక కోర్టులు ఊరట ఇచ్చాయి.అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌కు తొలిరోజే అక్కడి కోర్టులు షాక్‌ ఇచ్చాయి. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్‌ రద్దు చేస్తూ ఆర్టర్‌ పాస్‌ చేశారు. దీనిపై అమెరికాలో సియాటిల్‌ ఫెడరల్‌ కోర్టు అడ్డుకుంది. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశింది. ట్రంప్‌ నిర్ణయం రాజ్యంగ విరుద్ధమని తెలిపింది.

ట్రంప్‌ తీసుకున్న జన్మతః పౌరసత్వ రద్దు ఆర్డర్‌పై డెమెక్రాట్‌ల నేతృత్వంలోని వాషింగ్టన్‌, అరిజోనా, ఇల్లినాయిస్‌, ఓరేగాన్‌ రాష్ట్రాలు కోర్టును సియాటిల్‌ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం.. పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్‌ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ జాన్‌ కాఫ్నర్‌.. జన్మతః పౌరసత్వ రద్దు అమలు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారు. పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు కోర్టుల్లో పిల్‌ దాఖలు చేశాయి.

Back to top button