ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బుధవారం బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల అలర్ట్తో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు.
ప్రకాశం జిల్లాలో మంగళవారం వాతావరణం మారిపోయింది.. వర్షాలు కురిశాయి. తూర్పుప్రాంతంలో ఒకమోస్తరు వాన పడింది. జిల్లాలో జరుగుమల్లి మండలంలో 16.4మి.మీ, సింగరాయకొండలో 16.0మి.మీ, ఒంగోలులో 12.8మి.మీ, కొత్తపట్నంలో 10.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవరాల్లోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. మరో రెండు రోజులపాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు రైతుల్ని భయపెడుతున్నాయి. రోడ్ల పక్కన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు.. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. కొంత నష్టమైనా తప్పని పరిస్థితుల్లో ధాన్యం బయట వ్యక్తులకు అమ్ముకోవాల్సి వస్తోంది అంటున్నారు. కొందరు అవకాశం ఉన్న మేరకు ధాన్యం అమ్మేయగా.. మరికొంత ధాన్యం రోడ్లపైనే గుట్టలుగా ఉంచారు. చిన్నవర్షానికి రైతులు బరకాలు తీసుకుని కళ్లాల దగ్గరకు వెళ్లారు.. వర్షం పెద్దది కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాని ఆరబోసిన ధాన్యంపై బరకాలు కప్పుకునేలోగా ధాన్యం తడిచిపోయింది.
వర్షం వెలిసిన తర్వాత మళ్లీ ధాన్యం ఎండబెట్టుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి మబ్బులు, మేఘాలతో వాతావరణం కనిపించింది. గంటపాటు కురిసిన భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు, మెయిన్ రోడ్లు నీట మునిగాయి. అయితే ఖరీఫ్ పంటలు చేతికి అందే సమయం కావడంతో ఈ వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన రైతుల్లో ఉంది. ఈ ఏడాది వరుసగా అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు పడ్డాయి. రాయలసీమ జిల్లాల్లో మినహా కోస్తాంధ్ర జిల్లాల్లో సగటు కంటే అధికంగా వర్షపాతం నమోదైంది.
మరిన్ని వార్తలు చదవండి ..
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి