తెలంగాణ

ఫ్రీ బస్సు పథకం వల్ల టీజీఎస్ఆర్టీసీకి 2500 కోట్ల నష్టం.. ఒక్క పైసా కూడా ఇవ్వని సర్కార్!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఈ పథకం మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదట్లో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరగ్గా.. ఆ తర్వాత సీట్ల కోసం మహిళా ప్రయాణికులే తమలో తాము దాడులు చేసుకున్న వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. కాగా.. ఇప్పుడు పరిమితికి మించి ఎక్కుతుండటంతో డ్రైవర్లు, కండక్టర్లు.. తీవ్ర అసహనానికి లోనవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ పథకంపై టీజీఎస్ ఆర్టీసీ డిపార్ట్ మెంట్‌కు చెందిన వాళ్లే.. విమర్శలు గుప్పిస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Read Also : బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన వరల్డ్ ఛాంపియన్స్‌

కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల.. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగిందని.. కొన్ని బస్సుల్లో 120 శాతం కూడా ఉంటుందని సంస్థ అధికారులు చెప్తున్నారు. రికార్డు స్థాయిలో రోజుకు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ద్వారా ప్రయాణాలు సాగిస్తున్నట్టుగా చెప్తున్నారు. కాగా.. ఇందులో 70 శాతం మంత్రి మహిళలే కావటం గమనార్హం. అయితే.. ఈ ఉతిత బస్సు పథకం కింద.. మహిళలకు జీరో టికెట్ ఇస్తుండగా.. వాటికి డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే.. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రూ. 2500 కోట్ల నిధులను సంస్థకు రేవంత్ రెడ్డి సర్కారు తక్షణం చెల్లించాలని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పదా??.. పార్టీ మారేందుకు సిద్దమైన మరో ఎమ్మెల్యే!!

హైదరాబాద్‌లో సుందరయ్య కళానిలయంలో ఫెడరేషన్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో సంస్థకు ఆరు నెలలుగా రోజుకు సుమారు రూ.15 కోట్ల చొప్పున నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ. 2,500 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీకి ఫ్రీ బస్సు పథకానికి సంబంధించిన డబ్బుల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి : 

  1. కాగజ్ మద్దూరు దళితుల “శ్మశాన వాటికకు” హక్కు పత్రం ఇవ్వాలని ధర్నా…
  2. రేపో మాపో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్?
  3. ములుగు జిల్లాను రామప్ప ములుగు జిల్లాగా ప్రకటించాలి.. రామప్ప పరిరక్షణ కమిటీ
  4. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం.. గడువు ముగిసిందని తిప్పి పంపిన బ్యాంకు అధికారులు!!!
  5. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇటుక పెళ్ల కదిలించినా హైదరాబాద్‌లోని గాంధీభవన్ కూల్చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!

Related Articles

Back to top button