ఆంధ్ర ప్రదేశ్

జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం : ఆర్థిక మంత్రి

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ : గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. రాష్ట్రంపై ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు మోపారని, వాటికి వడ్డీలు కట్టాలంటూ ప్రతి శుక్రవారం తనకు ఏదో ఒక బ్యాంకు నుంచి ఫోన్‌ వస్తోందని చెప్పారు. వైసీపీ చేసిన విధ్వంసంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని జాగ్రత్తగా పాలన సాగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొంచెం సమయం తీసుకున్నా చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వారి బకాయిలను మార్చిలోపు ఎంతో కొంత చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read : మద్యం ప్రియులకు పండగే.. పండగ… వైన్స్‌ షాపులు, బార్‌ల సమయ వేళలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్నూలు నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో స్టేట్‌ ఆఫ్‌ ఏపీ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (సబ్‌కా) 2025-డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం జీతాలకు, పెన్షన్లకే సరిపోతోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, దీనివల్ల ఆదాయం పెరుగుతుందని, దీంతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త పథకాలకు రూపకల్పన చేయవచ్చని చెప్పారు.

Read Also : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా

బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ.. జగన్‌ హయాంలో తనకు రావాల్సిన రూ.88 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. వాటిని చెల్లించమని పలుమార్లు విన్నవించగా.. పార్టీ మారితే బిల్లులు చెల్లిస్తామని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. 250 మంది కాంట్రాక్టర్లు బిల్లుల కోసం విశాఖలో పార్టీ మారినా కూడా వారి బిల్లులు చెల్లించలేదన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత
  2. శుభవార్త అందించిన టీటీడీ బోర్డు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి
  3. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన
  4. రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్!… ఇంటర్నేషనల్ రికార్డ్?
Back to top button