జాతీయం

రాజ్యసభకు కమల్‌ హాసన్‌ - విజయ్‌కు చెక్‌ పెట్టేందుకేనా..?

తమిళనాడు రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్‌కు చెక్‌ పెట్టేందుకు డీఎంకే పావులు కదుపుతోంది. కమల్‌ హాసన్‌ ద్వారా విజయ్‌కు చెక్‌ పెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగా.. కమల్‌ హాసన్‌ను రాజ్యసభకు పంపుతోంది. దీని వల్ల విజయ్‌కు ఎలా చెక్‌ పెట్టొచ్చు..? పెద్దల సభకు కమల్‌ ఎంట్రీ వెనుక వ్యూహమేంటి…?

విజయ్‌.. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ.. తన పదునైన విమర్శలతో ముందుకెళ్తున్నారు. డీఎంకే టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో… డీఎంకే కూడా విజయ్‌కు చెక్‌ పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని సమాచారం. హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు విజయ్‌. ఆ అభిమానులే.. విజయ్‌కు కొండంత బలం. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎలానో.. తమిళనాడు విజయ్‌ అలా. ఆ అభిమానుల బలంతోనే విజయ్‌.. అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఆయన కన్ను సీఎం పదవిపై ఉంది. ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు విజయ్‌. దీంతో.. విజయ్‌కు కళ్లెం వేసేందుకు బలమైన స్కెచ్‌ వేసింది డీఎంకే. సినిమా అభిమానాన్ని.. సినిమాతోనే చెక్‌ పెట్టాలని కమల్‌ హాసన్‌ను రంగంలోకి దింపుతోంది. విజయ్‌ స్పీడ్‌కు.. కమల్‌హాసన్‌ రూపంలో బ్రేక్‌ వేయాలని చూస్తోందని సమాచారం.

మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది డీఎంకే. 2024 ఎన్నికల్లోనూ డీఎంకే, ఎంఎన్‌ఎం పార్టీలు కలిసి నడిచాయి. కమల్‌ హాసన్‌కు రాజ్యసభ ఇవ్వాలని… అప్పట్లోనే రెండు పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుండా.. ఇప్పుడు కమల్‌ను రాజ్యసభకు పంపబోతోంది డీఎంకే. జూన్‌ 19న 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఆరు స్థానాలు తమిళనాడులోవి. ఈ ఆరింటిలో నాలుగు స్థానలను గెలుచుకునే బలం డీఎంకేకు ఉంది. ఆ నాలుగింటిలో ఒకటి స్థానం కమల్‌ కోసం కేటాయించింది డీఎంకే. దీంతో కమల్‌ హాసన్‌ పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమైనట్టే. కమల్‌కు రాజ్యసభ ఇవ్వడం వెనుక.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాదు… తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్‌కు చెక్‌ పెట్టే ప్లాన్‌ కూడా ఉంది. సినిమా పరంగా చూస్తే… విజయ్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో… కమల్‌హాసన్‌కు ఎంత కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. దీంతో.. కమల్‌ హాసన్‌తోనే విజయ్‌ దూకుడుకు కళ్లెం వేయొచ్చన్నది డీఎంకే ప్లాన్‌. అంటే.. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతను… కరెక్ట్‌గా వర్కౌట్‌ చేస్తోంది డీఎంకే.

Back to top button