
-
వెలిమినేడులో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
-
నిరుపేద కుటుంబంలో తీవ్ర కంఠశోష
క్రైమ్ మిర్రర్, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తీవ్ర విషాదం నెలకొంది. కరెంట్ షాక్ ఓ పేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. రాంకీ రియల్ ఎస్టేట్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న జంగా లక్ష్మారెడ్డి (43) కరెంట్ షాక్‌తో చనిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి… సోమవారం ఉదయం తను రెంట్‌కు తీసుకున్న ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు లక్ష్మారెడ్డి ప్రయత్నించారు. జీవైర్ కరెంట్ తీగపై పడటంతో కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితికి జారకున్నాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపే లక్ష్మారెడ్డి చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ వెల్లడించారు.