క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు పరిపాలనలో వేగం పెంచడానికి మరియు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఉద్దేశించినవిగా తెలుస్తోంది.
బదిలీ అయిన అధికారులు, వారి కొత్త బాధ్యతల వివరాలు:
కె. ఇలంబర్తి: రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఇ. శ్రీధర్: బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా కొనసాగుతూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
అనితా రామచంద్రన్: గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
సవ్యసాచి ఘోష్: ఫ్లాగ్షిప్ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అదనంగా, ఆయన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతారు.
జి. జితేందర్ రెడ్డి: ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు.
యాస్మిన్ బాషా: ఆయిల్‌ఫెడ్ (Oilfed) మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా నియమితులయ్యారు.
సైదులు: అభివృద్ధి, సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు.
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు స్వయంగా పర్యవేక్షిస్తారు.
Also Read:రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేనట్టే! రేవంత్ దిమ్మతిరిగే షాక్
Also Read:ఈ రెండు రోజులు సేఫ్.. మరో వాయుగుండంతో భారీ వర్షాలు





