
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకి తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయని వెదర్ రిపోర్ట్ ను పరిశీలించిన అధికారులు హెచ్చరించారు. నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్ లో 40.7° ఉష్ణోగ్రతలు నమోదయిందని తెలిపింది. ఎండలు పెరుగుతున్న వేళ ఏకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1. ఖమ్మం
2. నల్గొండ
3. సూర్యాపేట
4. భద్రాద్రి కొత్తగూడెం
5. మంచిర్యాల
6. యాదాద్రి
7. ఉమ్మడి వరంగల్
8. ఉమ్మడి కరీంనగర్
9. కొమరం భీం ఆసిఫాబాద్
10. ఆదిలాబాద్ బాద్
11. నిర్మల్
ఈ 11 జిల్లాలలో 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు రాబోయే మూడు రోజులలో రావచ్చని అధికారులు హెచ్చరించారు. మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగవచ్చని తెలిపారు. మరో ఏడు జిల్లాలలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండవచ్చు అని తెలిపింది. కాబట్టి ఈ ప్రజలు ఎవరు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు.
కాగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 35 నుంచి 40 డిగ్రీల వరకు దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ప్రతిరోజు నమోదు అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరోవైపు భారీ ఎండల కారణంగా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. కనుక వ్యవసాయదారులు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాజెక్టులలో నీరు లేక… భూగర్భ జలాల్లోనూ నీరు లేక పంట చేతికి వచ్చే సమయంలో పైరు ఎండిపోయే అవకాశం ఉందని చాలామంది రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.