తిరుమల మాఢ వీధుల్లో మద్యం తాగి హల్చల్

తిరుమలలో అపచారం జరిగింది. సాక్షాత్తు వేంకటేశ్వరుడు కొలువైన ఆలయ ప్రాంగంణంలోకి ఓ వ్యక్తి తాగి వచ్చాడు. శ్రీవారి మాఢ వీధుల్లోనే మత్తులో వీరంగం వేశాడు. బూతులు మాట్లాడుతూ హల్చల్ చేశాడు. తిరుమల కొండపై తాగుబోతు హంగామాతో భక్తులు అవాక్కయ్యారు.

Read More : మంత్రి పదవిపై ఆశ లేదన్న రాజగోపాల్‌రెడ్డి – ఇస్తే పార్టీకే మేలంటూ మెలిక..!

తిరుమలలో ఆలయ మాఢ వీధుల్లో మద్యం తాగిన వ్యక్తి ‘నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా’ అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయాడు. టీటీడీ సిబ్బంది వచ్చి తాగుబోతును పట్టుకుని వెళ్లారు. అయితే తిరుమలకు ఆ వ్యక్తి తాగి ఎలా వచ్చాడు అన్న వివరాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.మరోవైపు తిరుమలలో వరుసగా జరుగుతున్న ఘటనలతో వెంకన్న భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.

Exit mobile version