తెలంగాణహైదరాబాద్

టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. పోలీసుల అత్యుత్సాహం, సాధారణ ప్రజలను సైతం అదుపులోకి !!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్‌లోని టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పికెటింగ్‌లు నిర్వహించగా.. టీజీఎస్పీఎస్సీ కార్యాలయం గేటు ముందు బాహుబలి సినిమాలో యుద్ధం సమయంలో ఏర్పాటు చేసిన.. రక్షణ కవచాన్ని తలపించేలా.. భారీ బారేకేడ్లు ఏర్పాటు చేయటం గమనార్హం. ఈ క్రమంలో.. ముట్టడికి యత్నించిన యువతను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. టీజీఎస్పీఎస్సీ కార్యాలయానికి పెద్ద ఎత్తున యువత చేరుకుని ఆందోళన నిర్వహించగా.. పోలీసులు వాళ్లందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

Read Also : తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ సన్నాహక సమావేశం.. ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా!!

కేవలం టీజీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు వచ్చిన యువతను మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే.. నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలిపుతూ.. టీజీఎస్పీఎస్సీ కార్యాలయానికి తన భర్తతో కలిసి వచ్చిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు. ఆ రోడ్డు వెంట ఎవరొచ్చినా వాళ్లు ముట్టడికి యత్నిస్తున్నారేమోనని.. అదుపులోకి తీసుకుని.. పోలీసు వాహనాలు ఎక్కించటమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే.. ఓ భార్యభర్తల జంటను ఆపేసి, ఫోన్లు లాక్కున్నారు. దీంతో.. తాము సాధారణంగా రోడ్డు వెంట వెళ్తున్నామని, ఆందోళన చేయటానికి రాలేదంటూ ఆ జంట ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. అక్కడి నుంచి పంపించేశారు.

Also Read : సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్

మరోవైపు.. అదే రోడ్డు వెంట వెళ్తున్న రైతులు, సాధారణ ప్రజలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవటం గమనార్హం. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒక రైతు, ఒక లాయర్, ఆఫీసుకు వెళ్తున్న ఒక ఉద్యోగి ఉండగా.. వారిని పోలీస్ వాహనాలు ఎక్కించారు. మేము ఆందోళనకారులం కాదు బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా వినకపోవటంతో.. పోలీసులు మీదికి సీరియస్ అయ్యారు. దీంతో.. ఉన్నతాధికారులు కల్పించుకుని వాళ్లను వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం రోడ్డు మీద స్వేచ్ఛగా నడిచే హక్కు కూడా లేదా అంటూ వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. హైదరాబాద్‌ శివారులో పోలీసుల కాల్పులు.. నలుగురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్
  2. బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు!!
  3. విద్యుత్ షాక్ తో మహిళ మృతి.. అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు!!
  4. జులై 6 న సంగారెడ్డి కి డా. విశారాధన్ మహారాజ్…
  5. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం.. గడువు ముగిసిందని తిప్పి పంపిన బ్యాంకు అధికారులు!!!

Back to top button