
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టి20 టోర్నీలో భాగంగా నేడు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య టి20 క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఈరోజు జరగాల్సినటువంటి మ్యాచ్ కొన్ని తీవ్ర విమర్శల వేల పూర్తిగా ఈ మ్యాచ్ రద్దయింది. తాజాగా ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పాకిస్తాన్ పై తీవ్ర విమర్శల వేల మేనేజ్మెంట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వెంటనే ఇవాళ జరిగేటువంటి ఇండియా మరియు పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను రద్దు చేశారు. అయితే ఇటీవల ఇరుదేశాల మధ్య హాకీ మరియు వాలీబాల్ మ్యాచ్లు జరిగాయి. ఇవి బాగా జరగడంతోనే వరల్డ్ ఛాంపియన్షిప్ లీగ్ ను కూడా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ గురించి ఇప్పటికే హర్భుజన్ సింగ్, రైనా అలాగే శిఖర్ ధావన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్ను బాయ్ కాట్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ఛాంపియన్షిప్ టి20 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మరియు మన ఇండియన్ టీమ్లు పాల్గొన్నాయి. ఇందులో ఒకప్పటి స్టార్ బ్యాట్స్మెన్లు అలాగే స్టార్ బౌలర్లు అందరూ కూడా ఉన్నారు. మన ఇండియా టీంకు యువరాజ్ సింగ్ కెప్టెన్ గా నిలవగా… శిఖర్ ధావన్, రైనా, అంబటి రాయుడు, ఉత్తప్ప, ఇర్ఫాన్ పతాన్, సిద్ధార్థ కౌల్, యూసఫ్ పతాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా , వినయ్ కుమార్ లాంటి స్టార్ క్రికెటర్స్ ఈ టోర్నీలో పాల్గొన్నారు.
“హరిహర వీరమల్లు” సినిమా టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Great news