తెలంగాణ

అమరావతిలో అమిత్ షా.. పవన్, బండితో స్పెషల్ మీటింగ్!

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అమిత్ షా అమరావతిలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ క్యాంపస్‌లను అమిత్‌షా ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ , కేంద్ర మంత్రులు పాల్గొనన్నారు. ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముచ్చటించారు. అనంతరం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చేరుకుంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను ఆయన ప్రారంభిస్తారు.

రెండురోజుల పర్యటన కోసం రాత్రి విజయవాడ చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్‌ షాకు రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం అమిత్‌ షా సీఎం చంద్రబాబు ఇంటికి చేరుకున్నరు. అక్కడ ఆయనకు విందు ఏర్పాటు చేశారు. విందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా హాజరయ్యారు.

విందు అనంతరం అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమ­య్యారు. వారు కొద్దిసేపు పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు కూటమి నేతలు తెలిపారు. విందులో కేంద్ర మంత్రులు బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివా­స­వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్‌ షా విజయవాడలోని ఓ హోటల్‌లో బస చేశారు.

Back to top button