తెలంగాణ

చంద్రబాబు పరువు తీసిన రేవంత్.. టీడీపీ కేడర్ గుస్సా!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది గురు శిష్యుల బంధం. తన గురువు చంద్రబాబేనని చాలా సార్లు ఓపెన్ గానే రేవంత్ రెడ్డి చెప్పారు. టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి.. చంద్రబాబు నాయకత్వంలోనే బలమైన నేతగా ఎదిగారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఈ కేసులో అడ్డంగా బుక్ కావాల్సిన చంద్రబాబును కాపాడరనే టాక్ ఉంది. రేవంత్ కాంగ్రెస్ లో చేరినా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబును కలిసి ఆశిస్సులు తీసుకున్నారు.

టీడీపీ కేడర్ కూడా రేవంత్ రెడ్డిని తమవాడిగానే చూస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కోసం టీడీపీ కేడరంతా బహిరంగంగానే పని చేసింది. రేవంత్ కోసమే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉందని చెబుతారు. అయితే చంద్రబాబు శిష్యుడిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి.. తాజాగా రూట్ మార్చారు. చంద్రబాబు పరువు పోయేలా కామెంట్ చేశారు. చంద్రబాబును టార్గెట్ చేసేలా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తమ్ముళ్లు అస్సులు జీర్ణించుకోవడం లేదు. సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పోస్టులు కూడా పెట్టారు.

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు జరుపుతోంది రేవంత్ సర్కార్. రోజుకో కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా పాలన సంబరాల్లో భాగంగా రైజింగ్ తెలంగాణ వేడుకలు జరిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. ఏపీ సీఎం చంద్రబాబు పరువు పోయేలా మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా హైదరాబాద్ గురించే చెబుతారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టానంటారు. తన వల్లే హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు చెబుతుంటారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు వల్లే హైదరాబాద్ కు ఐటీ వచ్చిందని చెప్పారు. కాని తాజాగా ఆయన రూట్ మార్చారు. హైదరాబాద్ ఐటీ ఘనత చంద్రబాబుది కాదంటూ బాంబ్ పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి.

విశ్వ నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్ది, న్యూయార్క్ లాంటి నగరాలతో సమానంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు.హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు..ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ది.
కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగు నీటి సమస్య పరిష్కారమైందని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయని.. నగరానికి మణిహారంలా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. హైదరాబాద్ ఐటీ ఘనత చంద్రబాబుది కాదని రేవంత్ చెప్పడాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరిన్ని వార్తలు చదవండి…

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button