క్రైమ్ మిర్రర్, చండూరు : చండూరు మున్సిపాలిటీలో శుక్రవారం జరిగే సంతలో సెల్ఫోన్ దొంగలు రెచ్చిపోతున్నారు. సంత జరిగిందంటే ఆరోజు సెల్ ఫోన్లు మాయం కావాల్సిందే. ఎక్కువగా మహిళల వద్ద ఉండే సెల్ఫోన్లను దొంగలు అపహరిస్తున్నారు. మహిళలు కూరగాయలు కొనే హడావిడిలో ఉన్నప్పుడు అదును చూసి సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నారు. ఎక్కువమంది గుమీకూడి కూరగాయలు కొనేచోట దొంగలు కూడా వారిలోనే కలిసి పోతున్నారు. బాధితులు తేరుకొని చూసేసరికి అప్పటికే సెల్ఫోన్ మాయమవుతుంది. గత కొన్నాళ్లుగా ఈ తతంగం నడుస్తూనే ఉంది.
Read Also : దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రేవంత్ సర్కార్‌పై మండిపడిన కేటీఆర్!!!
సెల్ఫోన్లను పోగొట్టుకోవడంతో పాటు మరికొందరు బంగారు నగలను కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం ఓ మహిళకు సంబంధించిన సెల్ ఫోన్ కూడా సంతలో దొంగతనానికి గురైంది. మున్సిపాలిటీ భవనం వెనుక ఇరుకైన ప్రదేశం లో కూరగాయల సంత జరుగుతుంది. సరైన లైటింగ్ కూడా ఇక్కడ ఉండదు. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులు అడపాదడపా దృష్టి పెడుతున్నప్పటికీ సెల్ ఫోన్లు అపహరణం మాత్రం నియంత్రించలేకపోతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ వారు కూడా లైటింగ్ సదుపాయం కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు… ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ!!
- యువత సన్మార్గంలో నడుచుకోవాలి…-వెంకటాపూర్ ఎస్సై జక్కుల సతీష్
- తప్పుడు ఆరోపణలు చేస్తే కబర్దార్…?..మన ఇద్దరిపై సిబిఐ దర్యాప్తు చెపిద్దాం―నువ్వు సిద్ధమా….?
- అద్దంకి దయాకర్ సినిమా టైటిల్ ఫిక్స్.. పాన్ ఇండియా సినిమాకు పవర్ ఫుల్ టైటిల్!!