
నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఆసక్తికర ఘటన జరిగింది. తన కోడిని కొట్టారని.. అకారణంగా కోడిని కొట్టిన వ్యక్తిని శిక్షించాలని ఓ మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తనకు నష్ట పరిహారం అవసరం లేదని.. కోడిని కొట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కోడిని తీసుకుని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళను చూసి పోలీసులు షాకయ్యారు. వివరాలు తెలుసుకుని మరింతగా షాకయ్యారు. న్యాయం చేస్తామని చెప్పి మహిళను పంపించి వేశారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో ఈ ఘటన జరిగింది. తన గడ్డివాములో కోడి గింజలు తింటుందని.. అయితే రాకేష్ అనే వ్యక్తి కర్రతో కొట్టడంటో కోడి కాలు విరిగిందని గంగమ్మ చెబుతోంది. కాలు విరిగిన కోడిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చింది. రాకేష్ పై ఫిర్యాదు చేసింది. కోడిని కొట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. అయితే పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, రాకేష్‌కు శిక్ష పడాల్సిందేనంటూ పట్టుబట్టింది గంగమ్మ. దీంతో రాకేష్ ను పిలిపిస్తామని.. ఉదయం రావాలని చెప్పి గంగమ్మను ఇంటింకి పంపించారు నకిరేకల్ పోలీసులు.