తెలంగాణ

కాకమ్మ కథలు చెబుతున్నది రేవంత్ రెడ్డే… మేము కాదు!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-

1.భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పబ్లిసిటీ కోసం చిల్లరగా మాట్లాడుతుండు.

2.కావాలంటే సీఎం రేవంత్ రెడ్డికి భజన చేసుకో..అంతేగాని పబ్లిసిటీ కోసం ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్

3.కాకమ్మ కథలు చెబుతున్నది రేవంత్ రెడ్డే.. సీఎంగా ఉన్నానన్న సోయి లేకుండా ఎక్కడో ఏదో జరిగితే కేటీఆర్ కు లింక్ పెట్టి మాట్లాడుతుండు..

4.సీఎం రేవంత్ మాటలు చూసి తెలంగాణకు ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఎవరున్నారనే డౌట్స్ జనాలకు వస్తున్నాయి..

5.కేసీఆర్ కుటుంబం ఉత్తగనే అధికారం చెలాయించలే.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది.. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల దీవెనలతో గెలిచింది..

6.సీఎం రేవంత్ రెడ్డే తన సోదురలను తెలంగాణపైకి వదిలాడు.. ఓ అన్న పాలమూరు జిల్లాను ఏలుతుంటే.. మరో తమ్ముడు ఐఏఎస్, ఐపీఎస్ లపై పెత్తనం చేస్తుండు..

7.మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి.. ఏ హోదాతో పది మంది గన్ మెన్లతో తిరుపతి రెడ్డి తిరుగుతున్నడు.. ఏ హోదా ఉందనిఐఏఎస్, ఐపీఎస్ లు కొండల్ రెడ్డికి సలాం కొడుతున్నరు.. ప్రజల మద్దతుతో గెలిచిన కేసీఆర్ కుటుంబం ఎక్కడ.. కనీసం సర్పంచ్ గా కూడా గెలవకుండానే రాజభోగాలు అనుభవిస్తున్న ఎనుముల కుటుంబం ఎక్కడ..

8.రేవంత్ రెడ్డికి మోడీ సపోర్ట్ ఉందని కవితమ్మ చెప్పడం కాదు.. కాంగ్రెస్ నేతలే అంటున్నరు.. ముందు వాళ్ల సంగతి చూడు

9.రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీనే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.. అలాంటి మోడీ ఇందుకు ఇస్తున్నడు..

10.అప్పుల గురించి అడ్డగోలుగా మాట్లాడకు.. ఐదు రోజుల క్రితం భట్టివిక్రమార్క రిలీజ్ చేసిన అట్లాస్ లో గత పదేళ్లలో ఏం జరిగిందో ఉంది.. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది..

రేవంత్ 14 నెలల్లో దాదాపు లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు..

11.కేసీఆర్ అప్పు తెచ్చి ప్రాజెక్టులు కట్టిండు.. మిషన్ భగీరథితో నీళ్లు తెచ్చిండు.. సచివాలయం.. జిల్లా కలెక్టరేట్లు.. మెడికల్ కాలేజీలు కట్టిండు.. 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఏం కట్టిండు..

12.సినిమాకు సంబంధించిన వ్యక్తి దుబాయ్ లో చనిపోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఏదోదో మాట్లాడుతున్నడు..

13.చనిపోయే ముందు కేదార్ ఏమైనా రేవంత్ కు ఫోన్ చేసి కేటీఆర్ పేరు చెప్పాడా.. లేక రేవంత్ కలలోకి వచ్చి చెప్పాడా..

14.ప్రభుత్వం మీదే కదా సమగ్ర విచారణ జరిపింది నిజాలు తేల్చు.. అది చేయకుండా చిల్లరగా మాట్లాడటం ఎంటీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button