తెలంగాణ

కొండా సురేఖకు క్లాస్ పీకిన సీఎం రేవంత్ రెడ్డి!

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. మంత్రి కొండా సురేఖతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారు. బహిరంగంగానే బూతులు తిట్టుకుంటున్నారు. ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డుపైనే కొట్టుకుంటున్నారు. వర్గ పోరుతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుండటంతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు.

వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలకు చక్కపెట్టే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి అప్పగించారు రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన వేం నరేందర్ రెడ్డి జిల్లా నేతలతో మాట్లాడారని తెలుస్తోంది. కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ క్లాస్ పీకారని తెలుస్తోంది. వరుసగా వివాదాల్లోకి చిక్కుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారని సమాచారం. పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందని.. దూకుడు తగ్గించుకోవాలని కొండాకు సీఎం సూచించారని చెబుతున్నారు.

మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. గీసుగొండలో కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేకపోవడం వివాదంగా మారింది. కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మంత్రి సురేఖ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రచ్చ చేశారు. ఈ విషయంలో కొండా సురేఖ తీరుపై పార్టీ పెద్దలకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రేవూరి ఒక్కరే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్క సహా ఇతర ఎమ్మెల్యేలతోనూ కొండా సురేఖకు పొసగడం లేదని టాక్. జిల్లా నేతలంతా ఫిర్యాదు చేయడంతో కొండాకు గట్టిగానే సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button