తెలంగాణరాజకీయం

ముఖ్యమంత్రి పర్యటనను విజవంతం చెయ్యాలి...ఎంపీ మల్లురవి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. కలెక్టర్ ఆదర్శ్ సురభి లు కలిసి సభ స్థల పరిశీలన చేశారు.

వనపర్తి క్రైమ్ మిర్రర్:  వనపర్తి జిల్లా కేంద్రంలో మార్చి 2నజరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల పై గురువారం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేతూడి మేఘారెడ్డి డిఎస్పీ వేంకటేశ్వర రావు, ఇతర జిల్లా అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.అనంతరం కే.డి.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల వెనక భాగంలో హెలిప్యాడ్ ఏర్పాట్లు, ముందు భాగంలో నిర్వహించనున్న ప్రజాపాలన – ప్రగతి బాట బహిరంగ సభకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు ఎలాంటి ఏర్పాటు చేయాలి అనే విషయాలపై పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులతో చర్చించారు.

వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అయన చేతుల మీదుగా జరిగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జాబ్ మేళా, నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి కలెక్టర్ ను సూచించారు.ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు , ఇటీవల వనపర్తి జిల్లా నుండి బదిలీ పై వెళ్లిన అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, ప్రస్తుత ఇన్చార్జి యాదయ్య, రోడ్లు భావనాల కార్యనిర్వహక ఇంజనీరు దేశ్యా నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డిఎస్పీ వేంకటేశ్వర రావు, సి. ఐ, ఎస్సై లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button