తెలుగు రాష్ట్రాల్లో సంచలం సృష్టిస్తున్న అఘోరీకి తృటిలో ప్రమాదం తప్పింది. కేదార్‌నాథ్ వెళుతుండగా అఘోరీ ప్రయాణిస్తున్న కారు టైర్ బ్లాస్ట్ అయ్యింది. చూసుకోకుండా 10 కిలోమీటర్లు అఘోరీ అలాగే వెళ్లింది. తర్వాత కారు ముందుకు వెళ్లకపోవడంతో వాహనాన్ని నిలిపి వేసింది. డెహ్రాడూన్ నుండి కొత్త టైర్ తీసుకొచ్చి అఘోరీ వాహనానికి ఓ భక్తుడు అమర్చాడు. దాంతో కేదరి బాబా దర్శనానికి ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే తెలంగాణలో పర్యటించిన అఘోరి.. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని బలి ఇవ్వాల్సి ఉందని కామెంట్ చేశారు. తర్వాత నగరంలోని పలు ప్రాంతాలు తిరిగారు. అదే సమయంలో ఆమెపై పలు ఆరోపణలు వచ్చాయి. అఘోరీపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అఘోరి ఫేక్ అంటూ కొందరు ప్రచారం చేశారు. ఈ వార్తలపై సీరియస్ అయిన అఘోరి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు. గురువు పిలుపుతో గుజరాత్ వెళ్లారు. అక్కడి నుంచి కేదారీనాథ్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారు టైర్ పేలినా తనకు ఏం కాలేదని అఘోరి తెలిపారు.