తెలంగాణ

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం.. గడువు ముగిసిందని తిప్పి పంపిన బ్యాంకు అధికారులు!!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నిరుపేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కానుకగా.. పెళ్లి ఖర్చులకు రూ.1,00,116 చెక్కుల రూపంలో అందించేవారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత.. పెళ్లిఫోటోలు, సంబంధిత పత్రాలు సమర్పిస్తే.. అర్హులైన వారికి ఈ పథకం కింద చెక్కులు మంజూరు చేసేవారు. ఆయా చెక్కులను మండల అధికారులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధిలు పంపిణీ చేశారు. అయితే కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెక్కులు సకాలంలో లబ్ధిదారులకు అందటం లేదు. మంచిర్యాల జిల్లాలో కూతురు పెళ్లి చేసిన దంపతులకు కల్యాణ లక్ష్మీ పథకం మంజూరు అయ్యింది. అయితే సంబంధిత చెక్కు తీసుకొని బ్యాంకుకు వెళ్లిన దంపతులకు వింత అనుభవం ఎదురైంది. చెక్కు చెల్లదని బ్యాంకు అధికారులు తిప్పి పంపారు.

Also Read : బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన వరల్డ్ ఛాంపియన్స్‌

దీంతో ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కు ఎందుకు చెల్లదని ఆ నిరుపేద దంపతులు అయోమయానికి గురయ్యారు. ఇంతలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చెక్కు డేట్ అయిపోవటంతో బ్యాంకు అధికారులు నిరాకరించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదుల్లబంధం గ్రామానికి చెంది సరిత- శ్రీనివాస్ దంపతులు 2023 ఫిబ్రవరి 23న తమ కుమార్తె వివాహం చేశారు. అయితే, వారు నిరుపేదలు కావటంతో కల్యాణ‌లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. తల్లి సరిత పేరు మీద 3 ఏప్రిల్ 2024న ప్రభుత్వం నుంచి రూ.1,00,116 చెక్కు మంజూరైంది. కాగా, అంతలోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ చెక్కులను లబ్ధిదారులెవరికీ పంపిణీ చేయలేదు. పార్లమెంట్ కోడ్ ముగిసిన తర్వాత గత నెల6న దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎత్తేశారు.

Read Also : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పదా??.. పార్టీ మారేందుకు సిద్దమైన మరో ఎమ్మెల్యే!!

అయినా మండల అధికారులు మాత్రం చెక్కులు పంపిణీ చేయలేదు. ఆ విషయాన్ని గాలికొదిలేసి చెక్కులు పంపిణీ చేయకుండా ఆలసత్వం వహించారు. ఈ క్రమంలో చెక్కు చెల్లుబాటు అయ్యేందుకు చివరి తేది 2024 జూలై 3 కావడంతో హడావుడిగా సాయంత్రం సమయంలో సరితకు ఫోన్ చేశారు. మండల ఆఫీసుకు వచ్చి చెక్కు తీసుకెళ్లాలని చెప్పారు. ఆమె వెళ్లి ఆఫీసులో చెక్కును తీసుకొని నేరుగా బ్యాంకుకు వెళ్లింది. అయితే అప్పటికి బ్యాంక్ పనివేళలు ముగిసిపోయాయి. చేసేందేం లేక ఇంటికి చేరుకున్న సరిత.. తన భర్తతో కలిసి మరసటి రోజు అంటే ఇవాళ బ్యాంకుకు వెళ్లారు. చెక్కును బ్యాంకు అధికారులకు ఇవ్వగా.. ఈ చెక్కు చెల్లదని.. దీని డేట్ అయిపోయిందని చెప్పారు. దీంతో దంపతులిద్దరూ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. నిరుపేదలైన తాము ప్రభుత్వం వచ్చే నగదుతో పెళ్లి అప్పు తీర్చాలనుకున్నామని.. అధికారులు నిర్లక్ష్యంగా చెల్లని చెక్కు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం చేసేలా ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. కాగజ్ మద్దూరు దళితుల “శ్మశాన వాటికకు” హక్కు పత్రం ఇవ్వాలని ధర్నా…
  2. రేపో మాపో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్?
  3. ములుగు జిల్లాను రామప్ప ములుగు జిల్లాగా ప్రకటించాలి.. రామప్ప పరిరక్షణ కమిటీ
  4. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇటుక పెళ్ల కదిలించినా హైదరాబాద్‌లోని గాంధీభవన్ కూల్చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!

Related Articles

Back to top button