సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి సమయంలో తీవ్ర కడుపునొప్పి రావడంతో రజినీకాంత్ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్‌కు ఇవాళ మరికొన్ని పరీక్షలు చేయనున్నారు. ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షల కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ అస్వస్థతకు గురవడంపై ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 73 సంవత్సరాలు. కొన్నిరోజులుగా వేట్టయాన్, కూలీ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు రజినీ.
50 Less than a minute