ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

సీక్రెట్ కెమెరాలో 300 వీడియోలు! లేడీస్ కాలేజీ హాస్టల్ బాత్రూంలో రికార్డ్

క్రైమ్ మిర్రర్, అమరావతి : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారన్న వార్త ఏపీలో దుమారం రేపుతోంది. లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడిందని తెలుస్తోంది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ ఉయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కళాశాలలోని విద్యార్థులు వాష్ రూమ్ కు వెళ్లాలంటే భయంతో గడగడలాడిపోతున్నారు. నిందితులు ఎలాంటి వారైనా బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిందితులను బహిరంగంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారా ల హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు.‌ ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి.

Read More : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు నేలమట్టం! హైడ్రా సంవలనం

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ బాలికల హాస్టల్ లో ఎలాంటి కెమెరాలు లేవని.. బాలికలు ఆందోళన చెందవద్దని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. ఈ ఘటనపై గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదన్నారు. నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను పోలీసులు పరిశీలించారు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందన్నారు. ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక్క ప్రేమ జంట ఓయో రూంకి వెళ్ళారు. ఆ అబ్బాయి వాళ్ళు గడిపిన క్షణాలను వీడియో తీశాడు. ఆ రికార్డు చేసిన వీడియోను వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేశాడు. ఆ తరువాత వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు. అయితే ఆ అమ్మాయికి సీక్రెట్ కెమెరా ఇచ్చి అమ్మయిల బాత్ రూమ్ లో పెట్టామన్నారు. ఆ అమ్మాయి అలానే చేసిందని.. వాళ్ళ ఫ్రెండ్స్ సుమారు 300 మంది అమ్మాయిల విడియోలు తీసీ డబ్బులు బ్లాక్ మెయిల్ చేశారని కాలేజీ విద్యార్థినులు చెబుతున్నారు.

Related Articles

Back to top button