తెలంగాణ

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

తెలంగాణ సచివాలయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరిగింది. ఎమ్మెల్యేను పోలీసులు పక్కన నిలబెట్టారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా పట్టించుకోకుండా సీఎస్ వస్తున్నారంటూ ఎమ్మెల్యేను దారుణంగా పక్కకు తోసేశారు. తనకు జరిగిన అవమానంతో తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే.

సెక్రటేరియట్‌లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 6వ అంతస్తుకు వెళ్లారు ఎమ్మెల్యే. అదే సమయంలో సీఎస్ శాంతి కుమారి తన చాంభర్ నుంచి బయటిరి వస్తోంది. దీంతో సీఎస్ వస్తున్నారంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని అడ్డుకున్నారు సచివాలయ సిబ్బంది.సీఎస్ శాంతి కుమారి వస్తున్నారు పక్కకు నిలబడండి అంటూ వనపర్తి ఎమ్మెల్యేకు చెప్పారు పోలీసులు. తాను ఎమ్మెల్యేను అని చెప్పినా.. మాకు ఆదేశాలు వచ్చాయంటూ మేఘారెడ్డిని చాలా సేపు పక్కకు నిలబెట్టారు పోలీసులు.

సచివాలయ సిబ్బంది తీరుతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే మేఘారెడ్డి.. సీఎస్ వస్తే ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ప్రశ్నించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది ఎమ్మెల్యేను గుర్తు పట్టకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. గతంలో సచివాలయంలో భద్రతగా టీఎస్ స్పెషల్ పోలీస్ ఉండేవారు. ఇటీవలే వారిని తొలగించి ఎస్పీఎఫ్ కు అప్పగించింది ప్రభుత్వం. దీంతో ఎమ్మెల్యేలకు అవమానాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Back to top button