- క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లో బీపీతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. లిక్కర్ స్కామ్ లో ఆమె గత నాలుగు నెలలుగా ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్నారు. రెండు రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కవిత ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కిందపడిపోయారు. జైలు సిబ్బంది ఆమెని ఉటా కొట్టిన దీన్ దయ్యాల ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో బుధవారం తిరిగి తీహార్ జైలుకు తరలించారు. లోబీపీతో బాధపడుతున్న కవితకు ఇంటి నుంచి మెడిసిన్ తెచ్చుకోవడానికి జైలు అధికారులు అనుమతిచ్చారు.
158 Less than a minute