క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్… రుణమాఫీ పథకాన్ని గురువారం నుంచే అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. లక్ష లోపు ఉన్న రుణాల సొమ్మును గురువారం సాయంత్రం కల్లా రైతుల ఖాతాలో వేస్తామని తెలిపారు. పాస్ బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తామని, కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అని స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేని 6.36 లక్షల మందికి కూడా మాఫీ వర్తిస్తుందన్నారు… రాష్ట్రంలో 90 లక్షల కార్డులు ఉండగా రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. రుణమాఫీ కోసం వేసిన మొత్తాన్ని బ్యాంకర్లు ఇతర ఖాతాల్లోకి జమ చేస్తే చర్యలు ఉంటాయన్నారు. ధరణి సమస్యలను నెలలోపున పరిష్కరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
8,938 Less than a minute