
క్రైమ్ మిర్రర్, మహబూబ్ నగర్ : జడ్చర్లలో ఓ తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు బాలురు లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సీఐ కమలాకర్ ఇచ్చిన సమాచారం మేరకు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల వయస్సు పదహారేళ్ల లోపే ఉండగా, వారు మూడు రోజుల క్రితం బాలికపై ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత బాలికను మహబూబ్ నగర్ లోని సంరక్షణ కేంద్రానికి తరలించారని, నిందిత బాలురపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.