తెలంగాణరంగారెడ్డిరాజకీయంహైదరాబాద్

రేవంత్‌పై తీన్మార్ మల్లన్న తిరుగుబాటు.. ఆయన వెనకున్నదెవరు?

తీన్మార్ మల్లన్న.. తెలంగాణ ఉద్యమంలో ముందున్న జర్నలిస్ట్.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజా సమస్యలు ధైర్యంగా ఎండగట్టిన ఏకైక వాయిస్. తెలంగాణ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్న తీన్మార్ మల్లన్న.. తాజాగా వేస్తున్న సంచలనంగా మారాయి. ఆయన పర్యటనలు, ప్రసంగాలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. బీసీ వర్గాల్లో ఉత్తేజం నింపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్ ఏంటీ.. ఆయన వ్యూహమేంటీ!

కేసీఆర్ పై పోరాడుతూ జైలుపాలైన తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. కొన్ని రోజులకే ఆ పార్టీకి బైబై చెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ గెలుపు కోసం రాష్ట్రమంతా తిరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా నల్గొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి శాసనమండిలిలో అడుగుపెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసినా తీన్మార్ మల్లన్న ఆయన సొంత బలంతోనే గెలచారనే టాక్ ఉంది. కొందరు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లన్నకు సహకరించలేదన్నది అందరికి తెలిసిందే. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం తనను ఓడించేందుకు కుట్ర చేసిందనే భావనలో ఉన్నారు తీన్మార్ మల్లన్న. అందుకే ఆయన ఆ వర్గాన్ని టార్గెట్ చేశారు. కొన్ని రోజులుగా బీసీ వాయిస్ తో జనంలోకి వెళుతున్నారు.

Read More : బామ్మర్ది లీగల్ నోటీస్ ఇస్తే భయపడిపోతానా!

బీసీ హక్కుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్ సర్కార్ ను కడిగిపారేస్తున్నారు. అవినీతి, అక్రమాలను బయటపెడుతున్నారు. ఇదీ బీసీ వర్గాల్లో తీన్మార్ మల్లన్న మైలేజీ పెంచేస్తోంది. తమకు బలమైన నేత దొరికారనే సంబరాల్లో ఉన్నారు బీసీ జనాలు. దశాబ్దాల పాటు బీసీ ఉద్యమం చేసిన ఆర్ కృష్ణయ్య ఇటీవలే రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో కలిసి తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం తీసుకురాబోతున్నారనే టాక్ వస్తోంది. అందుకే తీన్మార్ మల్లన్న బీసీ గళం మరింత పెంచుతున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనపైనా విమర్శలు చేస్తున్న మల్లన్న.. తాజాగా చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. రెడ్డి వర్గం భగ్గుమంటోంది. తీన్మార్ మల్లన్నపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది రెడ్డి జాగృతి.

Read More : రోడ్డెక్కిన ఎమ్మెల్యే రాజా సింగ్.. పాతబస్తీలో హై టెన్షన్

ఇదిలా ఉండగానే తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. తెలంగాణకు రేవంత్ రెడ్డే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పారు. 2028లో బీసీకి చెందిన వారే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్​ విషయంలో ఇంకా గైడ్​ లైన్స్​ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. తన రాజీనామాకు కొంతమంది డిమాండ్​ చేస్తున్నారని.. మండలిలో బీసీల సమస్యల గురించి ఎవరు ప్రస్తావిస్తారని మల్లన్న అన్నారు. పోటీ పరీక్షల్లో బీసీలకు 250 మార్కుల వచ్చినా ఉద్యోగం రావడంలేదని.. బీసీలకు ఇల్లు, ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు.బీసీల కోసమే పోరాడుతానని.. తీన్మార్ మల్లన్న కు రెడ్డిల ఓట్లు వద్దు బీసీల ఓట్లు చాలన్నారు.

మల్లన్న చేసిన ఈ కామెంట్లపై రెడ్డి వర్గంతో పాటు కాంగ్రెస్ లోని కొందరు అగ్రకుల లీడర్లు సీరియస్ అవుతున్నారని తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నపై యాక్షన్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారంటున్నారు. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫర్వాలేదు కాని బీసీ వాయిస్ విడిచే ప్రసక్తే లేదంటున్నారు తీన్మార్ మల్లన్న. బీసీ గళంతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశారని తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న కొన్ని రోజులుగా చేస్తున్న పోరాటానికి ఫిదా అవుతున్న బీసీ జనాలు.. ఆయన వెనక నడిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ విషయం తెలిసే బీసీలతో పెట్టుకోవద్దనే భావనలో కాంగ్రెస్ పెద్దలు తీన్మార్ మల్లన్న జోలికి రావడానికి భయపడుతున్నారని అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button